హాస్టల్‌ వసతి కల్పించండి | - | Sakshi
Sakshi News home page

హాస్టల్‌ వసతి కల్పించండి

Oct 7 2026 12:29 AM | Updated on Oct 7 2026 12:29 AM

తిరుపతి సిటీ: ఎస్వీయూ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ మెన్స్‌ హాస్టల్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పీజీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గిరిజన నవ సమాజ్‌ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు శివ శంకర్‌నాయక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వర్సిటీలో మంగళవారం విద్యార్థులతో కలిసి ఆయన నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్వీయూలో పీజీ అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఇప్పటికీ హాస్టల్‌ వసతి కల్పించకపోవడం బాధాకరమన్నారు. దసరా సెలవుల అనంతరం హాస్టల్‌ వసతి కల్పిస్తామని అధికారులు చెప్పడం విద్యార్థులను మరింత ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. హెచ్‌ బ్లాక్‌ను గత రెండేళ్లుగా మూసివేయడంతో పీజీ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఆర్ట్స్‌ విద్యార్థులకు ఒకే బ్లాక్‌లో వసతి కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే ఎస్వీయూ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పీజీ విద్యార్థులందరికీ సౌకర్యవంతమైన హాస్టల్‌ వసతి కల్పించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement