శ్రీసిటీలో అద్భుత సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

శ్రీసిటీలో అద్భుత సమ్మేళనం

Oct 7 2026 12:29 AM | Updated on Oct 7 2026 12:29 AM

శ్రీసిటీ (వరదయ్యపాళెం): శ్రీసిటీలో పరిశ్రమలు, ఆవిష్కరణలు, విద్య అద్భుత సమ్మేళనంగా కనిపిస్తోందని టీవీఎస్‌ ఆల్టర్నేటివ్స్‌ చైర్మన్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ మాజీ ఎండీ – సీఈఓ శ్యామ్‌ శ్రీనివాసన్‌ కితాబిచ్చారు. మంగళవారం ఆయన శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ ఎండీ డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు స్వాగతం పలికి సెజ్‌లోని ప్రపంచస్థాయి మౌలిక వసతులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతను వివరించారు. అనంతరం శ్యామ్‌ శ్రీనివాసన్‌ శ్రీసిటీ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను పరిశీలించారు.

శ్యామ్‌ నాయకత్వ అనుభవం యువతకు మార్గదర్శకం

శ్యామ్‌ శ్రీనివాసన్‌ను శ్రీసిటీకి స్వాగతించడం ఆనందంగా ఉందని డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి అన్నారు. ‘నాయకత్వంలో ఆయనకున్న విశిష్ట అనుభవం, వ్యాపార సంస్థలు, వ్యవస్థలు, ప్రజలపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన యువతకు విలువైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది’ అని పేర్కొన్నారు. అనంతరం క్రియా యూనివర్సిటీలో ఐఎఫ్‌ఎంఆర్‌ జీఎస్‌బీ డీన్‌ డాక్టర్‌ రాజేష్‌ చక్రవర్తి ఆధ్వర్యంలో జరిగిన ముఖాముఖి సమావేశంలో శ్యామ్‌ శ్రీనివాసన్‌ పాల్గొన్నారు.

నిరంతరం నేర్చుకోవాలి

తాను రచించిన ‘బెటర్‌ నెవర్‌ స్టాఫ్స్‌’ పుస్తక ప్రస్తావనతో విద్యార్థులతో తన అనుభవాలను పంచుకున్న శ్యామ్‌ శ్రీనివాసన్‌, సవాళ్లను ఎదుర్కొనే స్థైర్యం, నిజాయితీ, నిరంతర మెరుగుదలపై ప్రసంగించారు. మార్పును స్వీకరిస్తూ నిరంతరం నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు నాయకత్వం, కెరీర్‌ అంశాలపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. డాక్టర్‌ వసుప్రద శ్రీకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement