అంత్యక్రియలకు వెళ్లి వస్తూ.. | - | Sakshi
Sakshi News home page

అంత్యక్రియలకు వెళ్లి వస్తూ..

Oct 7 2026 12:29 AM | Updated on Oct 7 2026 12:29 AM

● రోడ్డు ప్రమాదంలో 9వ బెటాలియన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

డక్కిలి: స్నేహితుడి తల్లి అంత్యక్రిలకు వెళ్లి వస్తూ జరిగిన రోడ్డు ప్రమాదంలో 9వ బెటాలియన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మృతిచెందిన ఘటన మంగళవారం వెంకటగిరి–రాపూరు జాతీయ రహదారి నాగవోలు వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. నాయుడుపేట ప్రాంతానికి చెందిన 9వ బెటాలియన్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ప్రసన్నకుమార్‌(56) వెంటగిరిలో పనిచేస్తున్నారు. ఆయన కుటుంబం నాయుడుపేట పట్టణంలో ఉంది. విధులు నిమిత్తం వచ్చి అప్పుడప్పుడూ ఇంటికీ వెళ్లి వచ్చేవాడు. మంగళవారం తన స్నేహితుడు, ఆర్‌ఎస్‌ఐ కోటయ్య తల్లి మృతి చెందడంతో ఆయనతో కలిసి రాపూరు ఏరియాలో ఆమె అంత్యక్రియలకు హాజరయ్యారు. తిరిగి విధులకు హాజరయ్యేందుకు కారులో వస్తున్న క్రమంలో నాగవోలు గ్రామం వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని అతివేగంగా ఢీకొట్టారు. లారీ వెనుకభాగంలో కారు ఇరుక్కుంది. హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రసన్నకుమార్‌ డ్రైవింగ్‌ చేస్తున్న సీటులోనే ఇరుక్కుపోయి మృతిచెందారు. విషయం తెలుసుకున్న డక్కిలి ఎస్‌ఐ బ్రహ్మనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని, లారీ కింద ఇరుక్కుపోయిన కారును వెలికితీశారు. మృతదేహాన్ని అతికష్టం మీద బయటకు తీశారు. అనంతరం శవ పరీక్షల నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు.

విషాద ఛాయలు

ఘటనా స్థలం వద్దకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆయ్యో పాపం..! ఇంత ఘోర ప్రమాదం జరిగిందా..! అంటూ కన్నీటి పర్వంతమయ్యారు. తొమ్మిదో బెటాలియన్‌ విధులు నిర్వహిస్తున్న ప్రసన్నకుమార్‌ అందరితో కలివిడిగా ఉండే అధికారి అని, ఆయన మృతి తీరని లోటు అని తోటి ఉద్యోగులు కంటతడి పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement