తిరుపతి అర్బన్: ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతామని జాయింట్ కలెక్టర్ గోవిందరావు స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 378 అర్జీలను అధికారులు అందుకున్నారు. డీఆర్వో నరసింహులుతోపాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు భరత్‌నాయక్, శివశంకర్ నాయక్, నాగార్జున, రామాంజుణమ్మ తదితరులు అర్జీలు స్వీకరించారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల పోరుబాట
ఏళ్ల తరబడి ప్రభుత్వ వైద్య సేవల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్‌న్ కమిటీ నేతలు డిమాండ్ చేసింది. పారామెడికల్ కేడర్లలో రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని జేఏసీ చైర్మన్‌జి.కోటేశ్వరరావు, కన్వీనర్ ఎం.అజయ్‌కుమార్ సూచనల మేరకు సోమవారం తిరుపతి కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా జేఏసీ వైస్ ప్రెసిడెంట్ కిరణ్, పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు.
జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి
జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తిరుపతి జిల్లాను కరువు, వర్షాభావ ప్రభావిత ప్రాంతంగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఏ.రామానాయుడు డిమాండ్ చేశారు. జూనన్ 1 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 425.6 మి.మీ ఉండగా, కేవలం 257.7 మి.మీ మాత్రమే నమోదైందని గుర్తుచేశారు.
మేయర్ పదవి దళితులకు ఇవ్వాలి
రానున్న తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో దళితులకు మేయర్ పదవి ఇవ్వాలని అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తాళ్లపాక దాము కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక అధికారులకు వినతిపత్రం అందజేశారు.
పింఛన్లు తొలగిస్తున్నారు
పాకాల మండలంలోని దామలచెరువు గ్రామానికి చెందిన నారాయణదివ్యాంగుడని, కానీ పింఛన్ తొలగింపునకు కసరత్తు చేస్తున్నట్టు దివ్యాంగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్ తెలిపారు.
● చిత్తూరు–పీలేరు జాతీయ రహదారిలో సర్వే నం.20–60, 3ఈ లో ఉన్న ఏడు సెంట్ల పట్టా భూమిని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
● పాకాల మండలం, కమతంపల్లికి చెందిన సురేంద్రకు రెండు నెలలుగా దివ్యాంగుల పింఛన్‌న్ నిలిపివేశారని ఆరోపించారు.
● తిరుపతి ఆటోనగర్‌కు చెందిన అరుణ సబ్సిడీ రుణం మంజూరు చేయాలని జేసీకి వినతిపత్రం అందించారు.


