ఎంబీయూ విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

ఎంబీయూ విద్యార్థుల ప్రతిభ

Oct 6 2026 1:42 AM | Updated on Oct 6 2026 1:42 AM

చంద్రగిరి: మోహన్‌బాబు యూనివర్సిటీ విద్యార్థులు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో విశేష ప్రతిభ కనబరిచి 48 మంది విద్యార్థులు ఇటీవల జరిగిన నియామక ప్రక్రియలో డిజిటల్‌ స్పెషలిస్ట్‌ ఇంజినీర్‌, స్పెషలిస్ట్‌ ప్రోగ్రామర్‌ వంటి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. హైదరాబాద్‌కు చెందిన ఇన్ఫోసిస్‌ సంస్థ హెచ్‌ఆర్‌ ప్రతినిధులు ఈ క్యాంపస్‌ డ్రైవ్‌లో పాల్గొన్నారు. 2026–27 పాస్‌ అవుట్‌ విద్యార్థులకు మూడు రౌండ్ల పాటు నిర్వహించిన ఇంటర్వ్యూలలో ఫేస్‌–1 కింద 48 మంది విద్యార్థులు అర్హత సాధించగా, మరికొంతమంది విద్యార్థుల ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఎంపికై న విద్యార్థులు సంవత్సరానికి రూ.7 నుంచి రూ.10 లక్షల వరకు వేతన ప్యాకేజీలు అందుకోనున్నట్లు యాజమాన్యం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement