హోంగార్డు ఉద్యోగం పేరుతో టోకరా | - | Sakshi
Sakshi News home page

హోంగార్డు ఉద్యోగం పేరుతో టోకరా

Oct 6 2026 1:42 AM | Updated on Oct 6 2026 1:42 AM

తిరుపతి క్రైం: హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఇద్దరు యువకుల నుంచి రూ.6.95 లక్షలు వసూలు చేసి, నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చిన కేసులో నిందితుడిని అలిపిరి పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. నెల్లూరు జిల్లా, చేజర్ల మండలం, మడపల్లి గ్రామానికి చెందిన గుండుబోయన నరేష్‌ (31) ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరు జిల్లా, పోలీస్‌ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్న నరేష్‌.. డి.లోకేష్‌, ఎన్‌.సత్తికి హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. ఉద్యోగ ఖర్చుల పేరుతో లోకేష్‌ నుంచి రూ.4.95 లక్షలు, సత్తి నుంచి రూ.2 లక్షలు బ్యాంకు ఖాతాల ద్వారా తీసుకున్నాడు. అనంతరం నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై లోకేష్‌ ఈ నెల 2న అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నరేష్‌ సుమారు ఏడాది కాలంగా నెల్లూరు హోంగార్డు యూనిట్‌లో విధులకు గైర్హాజరవుతున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఎస్వీఆర్‌ఆర్‌జీజీ హాస్పిటల్‌ జంక్షన్‌న్‌ వద్ద నరేష్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

గతంలోనూ మోసం

నిందితుడిపై గతంలోనూ ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మంగళగిరి రూరల్‌ పోలీస్‌స్టేషనన్‌్‌ పరిధిలో ఓ వ్యక్తి నుంచి రూ.7 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదు రావడంతో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే బుచ్చిరెడ్డిపాలెం పోలీస్‌స్టేషన్‌న్‌ పరిధిలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.17.5 లక్షలు తీసుకున్నట్లు నమోదైన కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement