తిరుమల: టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు మాజీ మంత్రి కంతేటి సత్యనారాయణరాజు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం రూ.కోటికి పైగా విరాళం అందించారు. విరాళం డీడీనీ టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు అందజేశారు.
ఐసర్ సందర్శన
ఏర్పేడు: నాయుడుపేటకు చెందిన జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు సోమవారం ఏర్పేడు మండలం, జంగాలపల్లి సమీపంలో ఉన్న తిరుపతి ఐసర్‌ను సందర్శించారు. ఐసర్‌లోని యూజీ బ్లాక్‌లో ఉన్న ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబ్‌లను సందర్శించి సైన్‌న్స్ ప్రయోగాలను ప్రత్యక్షంగా వీక్షించారు. ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శాంతను భట్టాచార్య వారికి దగ్గరుండి ల్యాబ్‌లలో పరికరాల వినియోగం, శాసీ్త్రయ అవగాహన కల్పించారు. ఐసర్ సీఎస్‌వో వాసుదేవనాయుడు సహకారంతో విద్యార్థులు ఐసర్‌ను సందర్శించారు.


