డయల్‌ యువర్‌ ిసీఎండీకి 82 వినతులు | - | Sakshi
Sakshi News home page

డయల్‌ యువర్‌ ిసీఎండీకి 82 వినతులు

Oct 6 2026 1:42 AM | Updated on Oct 6 2026 1:42 AM

తిరుపతి రూరల్‌: ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలో సోమవారం జరిగిన ‘డయల్‌ యువర్‌ సీఎండీ’, ‘డయల్‌ యువర్‌ ఎస్‌ఈ’ కార్యక్రమాల ద్వారా వినియోగదారుల నుంచి 82 వినతులు అందినట్లు ఆ సంస్థ ప్రాజెక్ట్స్‌, ఐటీ, ఫైనాన్స్‌ విభాగాల డైరెక్టర్‌ పి.అయూబ్‌ఖాన్‌ తెలిపారు. ఏపీ ఎస్పీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో జరిగిన డయల్‌ యువర్‌ ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ కార్యక్రమానికి ఆయన హాజరై వినియోగదారుల నుంచి సమస్యలను స్వీకరించారు. డైరెక్టర్‌ కె.గురవయ్య, చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు జె.రమణాదేవి, ఎన్‌.శోభా వాలెంటీనా, ఆర్‌.పద్మ, ఎం.మురళీకుమార్‌, సీహెచ్‌ రామచంద్రరావు, ఎస్‌.రమణ, ఎం.శ్రీకాంత్‌, ఏ.శ్రీనివాసబాబు, జీ.సుధాకర్‌, ఓఎస్డీ యం. ఉమాపతి, జనరల్‌ మేనేజర్లు భాస్కర్‌రెడ్డి, లత, సురేష్‌ పాల్గొన్నారు.

అనధికార గృహాల క్రమబద్ధీకరణ

తిరుపతి అర్బన్‌: తిరుపతి పట్టణం, గ్రామీణ పరిధిలో అనధికార, అనుమతిలేని గృహాల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ సోమవారం అధికారులకు ఆదేశించారు. మంగళవారం నుంచి ఇంటింటా సర్వే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement