వెంకటగిరిలో రాజకీయ ‘జాతర’ | - | Sakshi
Sakshi News home page

వెంకటగిరిలో రాజకీయ ‘జాతర’

Oct 6 2026 1:42 AM | Updated on Oct 6 2026 1:42 AM

● రాజా కుటుంబీకులను అవమానిండం ఏమిటి? ● తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పాల్సిదే ● స్థానిక ఎన్నికల్లో ఉత్సాహవంతులైన యువతకే ప్రాధాన్యం

వెంకటగిరి(సైదాపురం): శ్రీపోలేరమ్మ జాతరను రాజకీయాలకు అతీతంగా జరపాల్సింది పోయి రాజకీయ జాతరగా మార్చడం ఏమిటని వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. పట్టణంలోని ఎన్‌జేఆర్‌ భవనంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలేరమ్మ తల్లి జాతరకు రాష్ట్ర పండుగ హాదా కల్పించారని గుర్తించారు. నిధులు, విరాళాలు అధికంగా వచ్చినా సౌకర్యాలు ఎందుకు కల్పించలేదని ఆయన ప్రశ్నించారు.

జాతర అంటేనే రాజాలదే!

వెంకటగిరి పోలేరమ్మ జాతర అంటేనే రాజాలదేనన్నారు. రాజా కుటుంబీకులకు జాతరలో ఓ ప్రత్యేక చారిత్రక, సంప్రదాయ ప్రాధాన్యత ఉందని, వారి అనుమతితోనే జాతరకు అంకురార్పణ కార్యక్రమంలో మొదలవుతుందని నేదురుమల్లి గుర్తుచేశారు. పోలేరమ దర్శనానికి వచ్చిన రాజా కుటుంబీకులను మంత్రి వస్తున్నారు.. కాసేపు ఆగండీ.. అంటూ నిలిపివేయడం వెంకటగిరి సంప్రదాయాలను అవమానించడమే అని మండిపడ్డారు. దేవదాయఖాఖ ఏఓను రాజా కుటుంబీకుల వద్దకు పంపుతారా..? లేక సీఐకి పూలమాల వేసి గౌరవిస్తారా..? అంటూ అధికారులు వ్యవహరించిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాలకు జరిగిన అవమాన వ్యవహారాన్ని పోలేరమ్మ తల్లే చూస్తుందని చెప్పారు. రాజాకుటుంబీకులకు జరిగిన అవమానకరమైన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

స్కూల్‌ కమిటీ ఎన్నికల్లోనూ

రాజకీయాలా?

నియోజకవర్గంలో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఎన్నికల్లో కూడా టీడీపీ నేతలు రాజకీయ రంగు వేయడం ఏమిటని నేదురుమల్లి ప్రశ్నించారు. కోరం పేరుతో ఎన్నికలను వాయిదా వేయడం సరికాదని, వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఎన్నికై న చోట్ల కోరం లేదంటూ ఎన్నికలను వాయిదా వేయించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. సమావేశంలో పులిప్రసాద్‌రెడ్డి, చిట్టేటి హరికృష్ణ, బాలయ్య, శంకరయ్య, కళ్యాణి, పూజారి లక్ష్మి, కార్తీక్‌రెడ్డి, నారాయణరెడ్డి, సదానందరెడ్డి, రాజారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, శివ, సాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement