దేవరకొండలో టీడీపీకి షాక్‌ | - | Sakshi
Sakshi News home page

దేవరకొండలో టీడీపీకి షాక్‌

Oct 6 2026 1:42 AM | Updated on Oct 6 2026 1:42 AM

వైఎస్సార్‌సీపీలోకి స్థానిక నేతలు

భాకరాపేట: చిన్నగొట్టిగల్లు మండలం, దేవరకొండ పంచాయతీలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి సమక్షంలో సోమవారం టీడీపీకి చెందిన ముఖ్యనాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో తగ్గని ఆదరణకు ఆకర్షితులై వైఎస్సార్‌సీపీలో చేరినట్లు పేర్కొన్నారు. దేవరకొండకు చెందిన టీడీపీ నేతలు కోటకొండ రత్నయ్య, మామిడికోన రెడ్డిప్రసాద్‌, దూదే చంద్రయ్య ఆధ్వర్యంలో వారి బంధువులు, అనుచరులు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సింహాల మోహన్‌, మాజీ ఎంపీపీ యుగంధర్‌రెడ్డి, మాజీ సీడీసీఎంఎస్‌ చైర్మన్‌ సహదేవరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement