ఎన్నికల ఏర్పాట్లు షురూ | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల ఏర్పాట్లు షురూ

Oct 6 2026 1:42 AM | Updated on Oct 6 2026 1:42 AM

తిరుపతి సిటీ: జిల్లాలో త్వరలో జరగనున్న స్థానిక, మున్సిపల్‌ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా బాలాజీ కాలనీలోని ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో స్ట్రాంగ్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది. పటిష్ట బందోబస్తు మధ్య సుమారు 670 వరకు ఖాళీ బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూమ్‌లో ఉంచారు. నిరంతర పోలీసుల పర్యవేక్షణతో పాటు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు.

శ్రీవారి దర్శనానికి 10 గంటలు

తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 90,292 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 27,329 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.61 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 10 గంటల సమయం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement