‘ఆకాశమంత’ ప్రగతి | - | Sakshi
Sakshi News home page

‘ఆకాశమంత’ ప్రగతి

Oct 6 2026 1:42 AM | Updated on Oct 6 2026 1:42 AM

సూళ్లూరుపేట: మారుమూల గ్రామాల్లో ఉండే సామాన్యుడికి సైతం అంతరిక్ష సాంకేతిక ప్రగతి ఫలాలను అందిస్తున్నామని, ఈ సేవలను మరింత విస్తతృంగా అందించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి ప్రశంసనీయమైందని అనంతపురం జేఎన్‌టీయూ వైస్‌ ఛాన్స్‌లర్‌ హెచ్‌.సుదర్శనరావు పేర్కొన్నారు. ఈనెల 4 నుంచి 10వ తేదీ దాకా నిర్వహించనున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని బ్రహ్మప్రకాష్‌ హాలులో సోమవారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. షార్‌ వాల్ప్‌ డిప్యూటీ డైరెక్టర్‌ శంకరన్‌ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన సుదర్శనరావు ప్రసంగిస్తూ రాబోయే రోజుల్లో గగన్‌యాన్‌ ప్రయోగంలో భాగంగా మానవ రహిత, మానవ సహిత ప్రయోగాలు చేసేస్థాయికి చేరుకోవడం భారతీయులకు గర్వకారణమని కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement