కురబలకోట : ఈఏపీసెట్ ర్యాంకర్లకు అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో ప్రత్యేక ఫీజు రాయితీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు ఛాన్సలర్ డాక్టర్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరానికి బీటెక్‌లో అడ్మిషన్లు కొనసాగుతున్నాయన్నారు. ఈఏపీసెట్ ర్యాంకర్లకు అనుగుణంగా వారి ప్రతిభ అధారంగా తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అభ్యసించే సువర్ణావకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ అరుదైన సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సివిల్ ఇంజినీరింగ్, సీఎస్‌ఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, ఈసీఈ, సీఎస్‌ఈ, బయోఇన్ఫాటిక్స్ తదితర కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రోఛాన్సలర్ నాదేళ్ల ద్వారకనాఽథ్, వీసీ యువరాజ్, రిజిస్ట్రార్ డి. ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు.


