స్వర్ణం.. మాయం! | - | Sakshi
Sakshi News home page

స్వర్ణం.. మాయం!

Jul 4 2026 12:38 AM | Updated on Jul 4 2026 12:38 AM

పట్టణాలకు తరలుతున్న ఇసుక

పెన్నేపల్లి వద్ద స్వర్ణముఖినదిలో ఇసుక అక్రమ తవ్వకాలు

పెళ్లకూరు మండలంలో అధికారులు పేట్రేగిపోతున్నారు. స్వర్ణముఖి నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేస్తూ నది రూపురేఖలే మార్చేస్తున్నారు. కలవకూరు చెక్‌డ్యామ్‌ నుంచి తాళ్వాయిపాడు గ్రామం వరకు సుమారు 17కి.మీ పరిధిలో ఉన్న స్వర్ణముఖినదిలో కలవకూరు, పుల్లూరు, ముమ్మారెడ్డిగుంట, చింతపూడి, రావులపాడు, పెళ్లకూరు, పాలచ్చూరు, చావలి, పెన్నేపల్లి, తాళ్వాయిపాడు ప్రాంతాల వద్ద ఆయా గ్రామాలకు చెందిన అధికార పార్టీ నాయకులు ట్రాక్టర్లు, లారీలతో యథేచ్ఛగా ఇసుక తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. నది మొత్తం రూపురేఖలు మారిపోయి కళావిహీనంగా మారింది. ఇప్పటికై నా అధికారులు కళ్లు తెరవాలని స్థానికులు కోరుతున్నారు.

– పెళ్లకూరు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement