చంద్రగిరి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

చంద్రగిరి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోండి

Jul 4 2026 12:38 AM | Updated on Jul 4 2026 12:38 AM

తిరుపతి లీగల్‌: మాజీ జిల్లా జడ్జి గుర్రప్పనాయుడును భయభ్రాంతులకు గురిచేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై చర్యలు తీసుకోవాలని తిరుపతి న్యాయవాదులు కొత్తపల్లి విజయ్కుమార్‌, శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు తెలిపారు. ఓ భూమికి సంబంధించి వృద్ధ దంపతులు తరఫున కేసును వాదిస్తున్న రిటైర్డ్‌ జిల్లా జడ్జిని సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్కళ్యాణ్‌ నీతి వ్యాఖ్యలు చెబుతారని, కానీ వారి పార్టీలలోని ఎమ్మెల్యేలు బూతు వాఖ్యలు చేస్తే చర్యలు శూన్యమని ఎద్దేవా చేశారు. తనకు వచ్చే వాటా పోతుందనే బాధతో ఆయనను అంతమొందించేందుకు రెక్కీ నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. రిటైర్డ్‌ జిల్లా జడ్జి గుర్రప్పనాయుడు ఫిర్యాదు మేరకు తిరుపతి జిల్లా ఎస్పీ వెంటనే చంద్రగిరి ఎమ్మెల్యే పై కేసు నమోదు చేయాలన్నారు. లేకుంటే తిరుపతి న్యాయవాదులు తగిన విధంగా చర్యలు చేపడతారని హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement