వసతి సముదాయం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

వసతి సముదాయం ప్రారంభం

Jul 4 2026 12:38 AM | Updated on Jul 4 2026 12:38 AM

తిరుపతి రూరల్‌: తిరుపతి రూరల్‌ మండలం, పాతకాల్వ పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీ వకుళామాత ఆలయం వద్ద యాత్రికులు బస చేయడానికి వీలుగా నిర్మించిన వసతి సముదాయాన్ని శుక్రవారం టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈఓ రవిచంద్ర ప్రారంభించారు. రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ నూతన వసతి సముదాయం అందుబాటులోకి రావడంతో అమ్మవారి అభిషేక సమయంలో భక్తులు ఇబ్బంది పడకుండా ఉంటారని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రారంభోత్సవంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి, పనబాక లక్ష్మి, దర్శన్‌, ఎన్‌ సదాశివరావు, డాలర్‌ దివాకర్‌రెడ్డి, హెచ్‌డీపీపీ కార్యదర్శి డాక్టర్‌ మేడసానిమోహన్‌, అదనపు కార్యదర్శి కల్యాణి, ఎస్‌ఈలు వేంకటేశ్వర్లు, మనోహరం, ఆలయ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, డిప్యూటీ ఈవోలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement