స్కూల్‌వ్యాను, బైక్‌ ఢీకొని ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌వ్యాను, బైక్‌ ఢీకొని ఒకరి మృతి

Apr 8 2026 7:32 AM | Updated on Apr 8 2026 7:32 AM

కలువాయి(సైదాపురం): కలువాయి మండలం తోపుగుంట సమీపంలో మంగళవారం స్కూలు వ్యాన్‌, బైక్‌ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందాడు. మరొకరు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. తోపుగుంట నుంచి కలువాయి వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న ఓ స్కూల్‌ బస్సు ఢీ కొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న కలువాయి మండలం నూకనపల్లికి చెందిన కలువాయి పెంచలయ్య (26), అనంతసాగరం మండలం పడమటికంభంపాడు గ్రామానికి చెందిన ఉయగిరి బాబు (27) గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయగిరి బాబు మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కోటయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement