ఓటర్ల జాబితా తయారీకి సహకరించాలి
తిరుపతి తుడా: నియోజకవర్గ పరిధిలో పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీకి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి మాట్లాడుతూ పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీకి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. స్పెషల్ ఇంటెన్షివ్ రివిజన్ – 2026పై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. 2025 జాబితాలోని ఓటర్లను 2002 ఓటర్ల జాబితాలోని ఓటర్లతో మ్యాపింగ్ ప్రక్రియ చేసే నిమిత్తం అందరూ బూత్ లెవెల్ అధికారులు, సూపర్‌వైజర్లు, గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించి, మ్యాపింగ్ శాతాన్ని పెంచాలన్నారు. డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ఎన్నికల డీటీ సుధాకర్ నాయక్ పాల్గొన్నారు.


