బసవయ్యపాళెంలోనే 80 గోవులు మాయం
– 8లో
– 8లో
చెవిరెడ్డి జీవితంలో చీకటి తొలగాలి
చెవిరెడ్డిని అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన జీవితంలో చీకటి తొలగాలని కోరుతూ పార్టీ నేతలు కొవ్వొత్తులు ర్యాలీ చేశారు.
పాడిఘోష!
పాలిచ్చే గోవుల్ని తోలుకుపోయారు
మాకు చాన్నాళ్లుగా గోవులున్నాయి. వాటిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. గత మూడు నెలల్లో ఏడు ఆవుల్ని దొంగలు తోలుకెళ్లారు. మా గోవుల్ని ఏం చేశారో తెలియదు. ఎవరికై నా అమ్మేశారా? లేదా కసాయికి తరలించారా? అర్థం కావడం లేదు. దీంతో మేము ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మా జీవనం కూడా కష్టంగా మారింది. – వళ్లియమ్మ,
బసవయ్యపాళెం, తొట్టంబేడు మండలం
దూడల్ని చూస్తే బాధేస్తోంది
గోవులిచ్చే పాలే మాకు జీవనాధారం. వాటిపై నే ఆధారపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. దూడలకు పాలిచ్చే గోవుల్ని చోరీ చేశారు. మా దొడ్లో కట్టేసిన మూడు ఆవుల్ని తోలుకెళ్లారు. ఒక్కో ఆవు రూ.50 వేలకుపైగా ఉంటుంది. రోజుకు 20 లీటర్లపైనే పాలిచ్చేవి. దూడలకు పాలు లేక అలమటిస్తున్నాయి. చాలా బాధాకరంగా ఉంది. – విజయమ్మ,
బసవయ్యపాళెం, తొట్టంబేడు మండలం
పాలు లేక దూడ చనిపోయింది
పాలిచ్చే గోవుల్ని దొంగలు తోలుకెళ్లారు. పాలు లేక దూడ చనిపోయింది. పోత పాలు పట్టించినా ప్రయోజనం లేకుండా పోయింది. మా బాధ ఎవరికి చెప్పుకునేది. పోలీసలకు చెప్పినా పట్టించుకోలేదు. ఆవుల చోరీతో మేము మళ్లీ ఆవులను కొనుగోలు చేయడానికి డబ్బులు లేక ఇక్కట్లు పడుతున్నాము. పశుసంవర్థక శాఖాధికారులైన పట్టించుకుని పాడి ఆవుల చోరీలను అరికట్టాలి. – పుష్ప,
బసవయ్యపాళెం, తొట్టంబేడు మండలం
పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు
మా గ్రామంలో 80కి పైగా గోవుల్ని దొంగలు చోరీ చేశారు. మా దొడ్లోని మూడు గోవుల్ని దొంగలు తోలుకుపోయారు. దీనిపైన పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. అధికారులు వెంటనే స్పందించి మా గ్రామానికి సంబంధించిన 80 గోవుల్ని తోలుకు పోయిన దొంగల్ని పట్టుకుని మాకు న్యాయం చేయాలి.
–రమేష్, బసవయ్యపాళెం, తొట్టంబేడు మండలం
శ్రీకాళహస్తి /తొట్టంబేడు: జిల్లాలో గోవుల దొంగలు చెలరేగిపోతున్నారు. రోడ్లు, పంట పొలాలు, ఖాళీ ప్రదేశాల్లో గోవులు కనిపిస్తే చాలు మాటు వేసి చోరీ చేస్తున్నారు. తిరుపతి పరిసర ప్రాంతాలతోపాటు తిరుచానూరు, చంద్రగిరి, రేణిగుంట, శ్రీకాళహస్తి రూరల్, తొట్టంబేడు ప్రాంతాల్లో ఆవుల దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. దొడ్లో కట్టి ఉంచిన ఆవులను సైతం రాత్రిపూట ఎవరూ లేని సమయంలో తాళ్లు విప్పి వ్యాన్లలో తరలించేస్తున్నారు. ఈ దొంగలు తెలుగు మాట్లాడడం లేదని తెలిసింది. హిందీ, కర్ణాటక భాషలో మాట్లాడుకుంటున్నట్టు బాధితులు చెబుతున్నారు. చూడుకట్టిన ఆవులు, బాగా బలంగా ఉన్న వాటినే మాయం చేస్తున్నట్టు వాపోతున్నారు. ఒక్కో గోవు సుమారు రూ.50 వేల పైనే ఉంటుందని పేర్కొంటున్నారు. గత ఆరు నెలలుగా ఈ తంతు జరుగుతున్నట్టు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
రూ.లక్షలు వెచ్చించినా.. కాపాడలేక!
సాధారణంగా జిల్లాలోని తూర్పు మండలాల రైతులు ఎక్కువగా పశుపోషణపై ఆధారపడి జీవిస్తుంటారు. రూ.వేలు వెచ్చించి అధిక పాలు ఇచ్చే ఆవులను పెంచుతుంటారు. ఒంగోలు, పుంగనూరు, గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి ఒక్కో ఆవును రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వెచ్చించి కొనుగోలు చేస్తుంటారు. ఆపై వాటిని కంటిరెప్పలా కాపాడుకుంటుంటారు. విస్తారంగా పచ్చిక బయళ్లు, మేతబీడు భూములు ఉండడంతో ఉదయం తోలి, సాయంత్రం ఇంటికి తోలుకొస్తుంటారు. కానీ ఇటీవల దోమల బాధ ఎక్కువ కావడంతో దొడ్లలో కట్టేయడం లేదు. ఈ క్రమంలో ఆవులు రోడ్ల వెంబడి, బహిరంగ ప్రదేశాల్లో సేద తీరుతుంటాయి. ఇదే అదునుగా భావించిన దొంగలు వాటికి మత్తు మందు ఇచ్చి చోరీ చేస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు. ఒక్క బసవయ్యపాళెంలోనే 80 ఆవులు మాయం కాగా.. అందులో ఒక్కో ఆవు రూ.30 వేల నుంచి రూ.80 వేల వరకు ఉంటుందని పేర్కొంటున్నారు. ఈలెక్కన సుమారు రూ.30 లక్షలపైనే నష్టపోయినట్టు వాపోతున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో గోవులు మిస్సవుతున్నాయి. ఈ నేపథ్యంలో రూ.కోట్ల మేరకు నష్టపోతున్నట్టు బాధితులు ఆవేదన చెందుతున్నారు.
గోవులను పోగొట్టుకున్న బాఽధితులు
బసవయ్యపాళేనికి చెందిన ఓ రైతు దొడ్లో కట్టేసిన మూడు ఆవుల్ని చోరులు తోలుకెళ్లారు. ఒక్కో ఆవు రూ.50 వేలకుపైగా ఉంటుంది. రోజుకు 20 లీటర్లపైనే పాలిచ్చేవి. ఈ స్థితిలో ఆ రైతు మా గోవులను కాపాడేవారేరీ అని ఆవేదన చెందుతున్నాడు. ఇది ఆయనొక్కరి వేదనే కాదు.. జిల్లాలోని పాడి రైతులు బాధ. హిందీ, కన్నడ భాషలు మాట్లాడే చోరుల ముఠాలు రెక్కీ నిర్వహించి మరీ నిత్యం గోవులను చోరీ చేస్తున్నాయి. దీంతో జిల్లాలోని పాడి రైతులు తీవ్రంగా నష్టపోవడంతోపాటు జీవనాధారం కోల్పోతున్నారు.
దొంగతనం ఎలా చేస్తారంటే?
ముందుగా ఆవులు ఎక్కువగా ఎక్కడున్నాయి? మేత కోసం ఎక్కడికి వెళతాయి.. మళ్లీ తిరిగి రాత్రి సమయానికి ఎక్కడికి చేరుకుంటాయో గమనిస్తారు. ఆపై ఇద్దరు వ్యక్తులు బైక్‌లపై ఎస్కార్ట్‌గా ఆవులున్న ప్రదేశానికి చేరుకుని గమనిస్తారు. ఆపై వాటిని తస్కరించేందుకు అనుకూల పరిస్థితులను కనుక్కుంటారు. తర్వాత తమ ముఠాకు సమాచారం ఇచ్చి వ్యాన్లను రప్పిస్తారు. ఆపై అరటి పండ్లు, బ్రెడ్డు, బన్ను, గులాబ్‌జామ్ లాంటి ఆహార పదార్థాల్లో మాత్రల రూపంలో మత్తు మందు కలిపి తిపినిస్తారు. ఆపై గోవులు మత్తులోకి జారుకున్నాక ముందర కాళ్లు వ్యాన్‌లోకి ఎక్కించి ఆపై ఓ యంత్రం ద్వారా గోవును మొత్తం పైకి నెడుతారు. ఇలా గోవులు ఎక్కించాక సుదూర ప్రాంతాలకు తరలించి కళేబరాలకు విక్రయిస్తారు.
బసవయ్యపాళెంలోనే 80 గోవులు మాయం
బసవయ్యపాళెంలోనే 80 గోవులు మాయం
బసవయ్యపాళెంలోనే 80 గోవులు మాయం


