పడగ విప్పిన పందేలు
పలు నగరాల నుంచి పందేలరాయుళ్లు
రూ. చేతులు మారుతున్న రూ.లక్షలు
కోడికో లెక్క కట్టారు.. కత్తికో విలువ పెట్టారు.. ఆటకో పద్దు పెట్టి మరీ ఆడిస్తున్నారు.. రూ.లక్షలు మారుస్తూ అడ్డగోలుగా కథ నడుపుతున్నారు. పోలీసుల సహకారం ఆసరాగా చేసుకుని పందేలు నడిపిస్తుండడం వారికే చెల్లింది. స్థానిక పచ్చనేత పందేలను నడిపిస్తుండడం వారికే చెల్లింది. అడిగేవారు లేరన్న ధైర్యం.. తెలిసినా ఏం చేస్తారనే నిర్లక్ష్యం..కారణమేదైనా పందేలు కోడి పందేలు నిరంతరాయంగా సాగుతున్నాయి.
సాక్షి టాస్క్‌పోర్సు: చిట్టమూరులో మూడు రోజులుగా చైన్నె, తిరుపతి, నెల్లూరు ప్రాంతాల నుంచి వచ్చిన పందేలరాయుళ్లు రూ.లక్షల్లో పందేలు కాస్తూ కోడి పందాలు ఆడుతున్నా, కనీసం అటు వైపుగా పోలీసులు కన్నెత్తి చూడక పోవడం గమనార్హం. మూడు రోజులుగా ఓ స్థానిక ప్రజాప్రతినిధి, పోలీసులతో కుమ్మకై రూ.లక్షల్లో కోడి పందేలు, జూదం అడుకునేందుకు అటవీ ప్రాంతాన్ని ఎంపిక చేసి, ఆడిస్తున్నా తమకు కనీస సమాచారం లేదని చెప్పడం వెనక మర్మం ఏమిటో పోలీసులే చెప్పాలి. గూడూరు నియోజకవర్గంలోని చిట్టమూరు మండలాన్ని ఈ నెల ఒకటో తేదీ నుంచి సూళ్లూరుపేట డివిజన్‌లోకి మార్చారు. దీంతో నాయుడుపేటలోని పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోకి వస్తున్నామని, తమ గ్రామానికి సమీపంలోని రిజర్వు ఫారెస్టును ఎంపిక చేసుకుని పెద్దస్థాయిలో కోడి పందేలు ఆడించేందుకు చిట్టమూరు మండలం దరఖాస్తు గ్రామానికి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధి సిద్ధం అయ్యారు. అయితే స్థానికంగా ఉండే పోలీసులతో కమీషన్ల విషయం మాట్లాడుకున్నారు. అంతే చైన్నె, తిరుపతి, నెల్లూరు ప్రాంతాలలో కోడి పందేలు ఆడుకునే వారికి సమాచారం ఇవ్వడంతో వారు తమ కార్లలో రెక్కలు కట్టుకుని వాలి పోయారు. ఈలోగా జూదం ఆడించే వారు అక్కడ ప్రత్యక్షం అయ్యారు. అంతే పోలీసులకు పండగే అటు కోడి పందెం ఆడించే వారితో పాటుగా జూదం( డైమండ్ డబ్బా, మూడు ముక్కల ఆట) అడే వారిని చూసీ చూడనట్లు వదిలివేస్తుండడంతో ఒక్క రోజులోనే రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కోడి పందేలు ఆడించేందుకు పోలీసులు ఇలా సహకారం అందించడం చూస్తుంటే చిన్నపాటి పందేలు వేసుకునే వారిపై కేసులు నమోదు చేస్తారని, అదే పెద్ద ఎత్తున పందేలు ఆడే వారిని మాత్రం చూసీ చూడనట్లు వదలి వేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దరఖాస్తు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కోడి పందాలు, జూదం జరుగుతుందనే విషయాన్ని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు దృష్టికి తీసుకెళ్లగా తమ దృష్టికి రాలేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని అన్నారు.
పోలీసుల కనుసన్నల్లోనే
పందేలు
పడగ విప్పిన పందేలు
పడగ విప్పిన పందేలు


