క్రీడాకారుడు గణేష్‌కు కలెక్టర్ అభినందన
తిరుపతి కల్చరల్ : నాయుడుపేటకు చెందిన క్రీడాకారుడు గణేష్‌ను ఆదివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అభినందించారు. గణేష్ ఇటీవల జరిగిన ప్రపంచ ఆర్చరీ యూత్ చాంపియన్ షిప్ టీమ్ గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన క్రీడాకారుడిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
నేటి నుంచి సఖీ సురక్ష
తిరుపతి అర్బన్ : ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు సఖీ సురక్ష పేరుతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో మెప్మా అధికారులతో కలసి పోస్టర్లను విడుదల చేశారు. జిల్లాలోని 35 సంవత్సరాల వయస్సుపైబడిన స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గురువారం వెంకటగిరి నియోజకవర్గంలో 411 మహిళా సంఘాలకు, 12వ తేదీన తిరుపతిలో 425 మహిళా సంఘాలు, గూడూరు నియోజకవర్గంలో 12వ తేదీన 810 సంఘాలు, 13 వతేదీన తిరుపతిలో మిగిలిన 425 సంఘాలు, 13న శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని 696 సంఘాలు, 15వ తేదీన తిరుపతిలోని మరో 1270 సంఘాలు, 16వ తేదీన పుత్తూరులోని 510 సంఘాలలోని మహిళలకు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
క్రీడాకారుడు గణేష్‌కు కలెక్టర్ అభినందన


