హక్కుల రక్షణ అందరి బాధ్యత
తిరుపతి సిటీ : మానవ హక్కుల రక్షణ పౌరులందరి బాధ్యతని వీసీ నర్సింగరావు తెలిపారు. బుధవారం ఎస్వీయూలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ మానవ హక్కులపై పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను, జ్ఞాపికలను అందజేశారు. రెక్టార్ సీహెచ్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుధారాణి, విశ్వం స్కూల్ డైరెక్టర్ ఎన్ విశ్వచందన్‌రెడ్డి, అధ్యాపకులు డాక్టర్ రవిబాబు, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ రంజిత్ కుమార్, డాక్టర్ కోదండరామిరెడ్డి , లాయర్ రాజ్ కుమార్ పాల్గొన్నారు.
మహిళా వర్సిటీలో..
తిరుపతి రూరల్ : మహిళా వర్సిటీలో మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ముఖ్యతిథిగా హాజరైన క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీ శ్యామ్‌సుందర్ మాట్లాడుతూ పౌరులందరు తమ హక్కులనే కాక బాధ్యతలను కూడా గుర్తించాలని కోరారు. సోషల్ మీడియా సైట్‌లో జాగ్రత్తగా ఉండాలని, ప్రధానంగా మహిళలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కో–ఆర్డినేటర్ ఆచార్య వాణి మాట్లాడుతూ మానవ హక్కులను పరిరక్షణ న్యాయ విద్యార్థులపై ఉందని తెలిపారు. అనంతరం మానవ హక్కుల పరిరక్షణపై విద్యార్థినులతో ఆచార్య టి.సీతా కుమారి ప్రతిజ్ఞ చేయించారు.
హక్కుల రక్షణ అందరి బాధ్యత


