ఏడు గంగల జన జాతర
తేరువీధిలో
నల్లగంగమ్మ
శ్రీకాళహస్తిలో రెండు రోజులుగా జరుగుతున్న ఏడు గంగల జాతర వైభవంగా సాగుతోంది. అమ్మవారి గుడి వద్ద నుంచి ఏడుగురు గంగమ్మలను ఆయా జాతర కమిటీలు మంగళవారం అర్ధరాత్రి ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేసి ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారిని చూసేందుకు భక్తులు విశేషంగా పాల్గొని హారతులు సమర్పించారు. ముతాలమ్మ గుడి వద్ద ప్రత్యేక హారతులు సమర్పించిన తరువాత పెండ్లి మండపం వరకు చేరుకుని మొదటి గంగమ్మను స్థాపించారు. భద్రకాళీలా భక్తులకు మొదటి గంగమ్మ పొన్నాలమ్మ రూపంలో కటాక్షించింది. గంగమ్మ వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం రాత్రి 7 గంటలకు అమ్మవార్లకు ఏడు గంగమ్మల ఆలయం వద్ద నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. కాగా ఊరేగింపులో కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కొత్తపేట గంగమ్మ ఊరేగింపులో ప్రముఖ సినీ హీరో చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్‌ను పోలిన డూప్‌లు ప్రజలను ఆకర్షించారు. – శ్రీకాళహస్తి
ఏడు గంగల జన జాతర
ఏడు గంగల జన జాతర
ఏడు గంగల జన జాతర
ఏడు గంగల జన జాతర
ఏడు గంగల జన జాతర
ఏడు గంగల జన జాతర


