చెరువు కట్టను తెగ్గొట్టిన భూ ఆక్రమణదారులు
చెరువు కట్టను తెగొట్టడంతో రైతులు తాత్కలికంగా వేసిన ఇసుక బస్తాలు
దొరవారిసత్రం: మండలంలోని బురదమడుగు చెరు వు పొరంబోకు భూమి ఆక్రమించి సాగు చేసే ఆక్రమణదారులు పంట పొలాలు నీట మునిగిపోవడంతో గత వారం చెరువు కట్టను రాత్రికి రాత్రే తెగొట్టిన ఘ టన ఆలస్యంగా గురువారం వెలుగు చూసింది. బురదమడుగు చెరువు కింద సుమారు 50 ఎకరాల ఆయకట్టు ఉండగా స్థానికులు పలువురు భూస్వాములు చె రువు పొరంబోకు భూమి సుమారు 30 ఎకరాల వరకు ఆక్రమించి గత కొన్నేళ్లు నుంచి సాగు చేస్తున్నారు. ఇటీవన దిత్వా తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసి చెరువు నిండిపోవడంతో పొరంబోకు భూమిలో సా గైన వరి ఎక్కడ మునిగిపోతుందోనని ఆక్రమణదారు లు చెరువు కట్టను తెగొట్టి నీటిని వదిలేశారు. దీంతో చెరువు నుంచి నీరు పొలాలపై ప్రవహించడంతో పొ లాలు దెబ్బతింటున్నాయి. ఇగిగేషన్ అధికారులుతో పాటు రెవెన్యూ అధికారులు తెలిపిన ఎలాంటి చర్యలు చేపట్టలేని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.


