● నేడు అంగన్‌వాడీ కార్యకర్తల మహాధర్నా ● అంగన్‌వాడీవర్కర్లకు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎస్టీయూ మద్దతు | - | Sakshi
Sakshi News home page

● నేడు అంగన్‌వాడీ కార్యకర్తల మహాధర్నా ● అంగన్‌వాడీవర్కర్లకు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎస్టీయూ మద్దతు

Dec 12 2025 6:03 AM | Updated on Dec 12 2025 6:03 AM

● నేడ

● నేడు అంగన్‌వాడీ కార్యకర్తల మహాధర్నా ● అంగన్‌వాడీవర్కర

● నేడు అంగన్‌వాడీ కార్యకర్తల మహాధర్నా ● అంగన్‌వాడీవర్కర్లకు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎస్టీయూ మద్దతు

తిరుపతి అర్బన్‌: అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు న్యాయమైన తమ పోరాటానికి సిద్ధమయ్యారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అంగన్‌వాడీల సమ్మెను బలపరచి..తాము అధికారంలోకి వస్తే అన్నీ సమస్యలకు తక్కువ వ్యవధిలోనే పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలు అంగన్‌వాడీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క సమస్యకూ పరిష్కారం చూపలేదని మండిపడుతున్నారు. పలు రకాల యాప్‌లతో పనిభారం తప్ప..సమస్యకు పరిష్కారం చూపలేదని దుయ్యబడుతున్నారు. గతంలో ఇచ్చిన మొబైళ్లు పాడైన నేపథ్యంలో కొత్త మొబైల్స్‌ను ఇవ్వాలని పోరాటాలు చేసినా, పట్టించుకోలేదని గుర్తుచేశారు. దీంతో గతంలో ఇచ్చిన మొబైళ్లను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చిన సంగతిని తెలియజేస్తున్నారు. పోరాటాలకు అంగన్‌వాడీలు సిద్ధం అవుతున్న విషయం తెలుసుకుని.. హుటాహుటీనా మొబైళ్ల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడాన్ని తప్పుపడుతున్నారు.

2,492 అంగన్‌వాడీ కేంద్రాలు మూతే..

కలెక్టరేట్‌ వద్ద శుక్రవారం పెద్ద ఎత్తున అంగన్‌వాడీ కార్యకర్తలు ధర్నా చేపట్టడానికి నిర్ణయించారు. దీంతో జిల్లాలోని 2,492 అంగన్‌వాడీ కేంద్రాలు శుక్రవారం మూతపడనున్నాయి.

వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ

తిరుపతిలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ధర్నాకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వ ర్క ర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వాణిశ్రీ, ఐఎస్‌టీయూ అంగన్‌వాడీ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు భారతి, టీఐటీ యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జయచంద్ర, సుబ్రహ్మణ్యం, తిరుపతి ప్రాజెక్టు కార్యదర్శి నాగరాజమ్మ, నాగరత్న తదితరులు పాల్గొన్నారు.

హామీలు నెరవేర్చండి

ప్రతిపక్షంలో ఉన్న సమ యంలో ఇచ్చిన హామీల ను నెరవేర్చాలని కోరు తున్నాం. అంగన్‌వాడీ వర్కర్లు అనేక సమస్య లతో బాధపడుతున్నారు. అయితే ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడం సరికాదు. న్యాయమైన కోర్కెల కోసమే మా పోరాటం. శాంతియుతంగా శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించాం. న్యాయం జరిగే వరకు పోరాటాలు చేస్తాం.

– పద్మలీలా, అంగన్‌వాడీ

వర్కర్స్‌ జిల్లా అధ్యక్షురాలు(సీఐటీయూ)

పనిభారం పెరిగింది

పనిభారం బాగా పెరిగింది. లెక్కలేనన్ని యా ప్‌లు వచ్చేశాయి. ఒక్కొ క్క అంశానికి ఒక్కొక్క యాప్‌ను ఇచ్చేశారు. అ న్ని యాప్‌లను ఒక్కటిగా తీసుకురావాలని కోరుతున్నాం. అలాగే ఎఫ్‌ఆర్‌ఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. మరోవైపు కనీస వేతనాలు రూ.26 వేలు చేయాలని కోరుతున్నాం. సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలి.

– వాణిశ్రీ, అంగన్‌వాడీ

వర్కర్స్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

ప్రీస్కూళ్లు బలోపేతం చేయాలి

ప్రీస్కూళ్లను బలోపేతం చేయాలి. ప్రీస్కూల్‌ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని వర్తింప చేయాలి. లబ్ధిదారులకు ఆయిల్‌, కందిపప్పు పరిమాణం పెంచాలి. మెనూ చార్జీలను పెంచాలి. ఉచితంగా గ్యాస్‌ సరఫరా చేయాలి. హెల్పర్ల పదోన్నతలకు నిర్థిష్టమైన గైడ్‌లైన్స్‌ రూపొందించాలి. మినీ వర్కర్ల క్వాలిఫికేషన్‌ రిలాక్సేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం.

– సౌజన్య, అంగవ్‌వాడీ వర్కర్స్‌

యూనియన్‌ శ్రీకాళహస్తి ప్రాజెక్టు అధ్యక్షురాలు

జిల్లా సమాచారం

అంగన్‌వాడీ ప్రాజెక్టుల సంఖ్య 11

అంగన్‌వాడీ సెంటర్లు 2,492

అంగన్‌వాడీ మెయిన్‌ సెంటర్ల కార్యకర్తలు 2,092

అంగ్‌వాడీ మినీ సెంటర్ల కార్యకర్తలు 348

అంగన్‌వాడీ హెల్పర్లు 2,066 మంది

అంగన్‌వాడీ పరిధిలో మొత్తం 1,46,669 మంది

గర్భిణిలు 12,788

బాలింతలు 11,007

6నెలల లోపు పిల్లలు 9,627

6 నెలలపైన–3 ఏళ్ల లోపు పిల్లలు 65,433

3 ఏళ్లపైన 6 ఏళ్లు లోపు పిల్లలు 47,814

● నేడు అంగన్‌వాడీ కార్యకర్తల మహాధర్నా ● అంగన్‌వాడీవర్కర1
1/4

● నేడు అంగన్‌వాడీ కార్యకర్తల మహాధర్నా ● అంగన్‌వాడీవర్కర

● నేడు అంగన్‌వాడీ కార్యకర్తల మహాధర్నా ● అంగన్‌వాడీవర్కర2
2/4

● నేడు అంగన్‌వాడీ కార్యకర్తల మహాధర్నా ● అంగన్‌వాడీవర్కర

● నేడు అంగన్‌వాడీ కార్యకర్తల మహాధర్నా ● అంగన్‌వాడీవర్కర3
3/4

● నేడు అంగన్‌వాడీ కార్యకర్తల మహాధర్నా ● అంగన్‌వాడీవర్కర

● నేడు అంగన్‌వాడీ కార్యకర్తల మహాధర్నా ● అంగన్‌వాడీవర్కర4
4/4

● నేడు అంగన్‌వాడీ కార్యకర్తల మహాధర్నా ● అంగన్‌వాడీవర్కర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement