ఇదీ ఒక గెలుపేనా..!
ఏర్పేడులో ఎంపీటీసీ సభ్యులందరూ వైఎస్సార్ సీపీ వారే
ఏర్పేడు: ‘ఎనిమిది నెలల పదవీ కాలం మాత్రమే మిగిలి ఉంది.. అందరూ వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులే.. అయినా టీడీపీ నేతలు ఒక్క ఎంపీటీసీ సభ్యు డు లేకపోయినా అధికారబలంతో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ స భ్యులను బెదిరించి, ప్రలోభాల కు గురి చేసి 9 మందిని వైఎస్సా ర్ సీపీని ఫిరాయించేలా చేసి తమ వైపునకు తిప్పుకుని ఒక్క స్థానం కూడా లేనిచోట రాజకీ య కుయుక్తులతో ఎంపీపీ పదవిని దక్కించుకు న్నారు. గురువారం ఏర్పేడు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జరిగిన ఎంపీపీ ఎన్నిక ప్రక్రియను చూసి ఇది కూడా ఒక్క గెలుపేనా..? అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.’ ఏర్పేడు మండలంలో ఉన్న 16 మంది ఎంపీటీసీ సభ్యుల్లో పల్లం ఎంపీటీసీ సభ్యురాలు గీత రాజీనామా చేయగా, ము సలిపేడు ఎంపీటీసీ స భ్యులు రమణమ్మ ఇటీవల మృతి చెందారు. దీంతో ప్రస్తుతం 14 మంది ఎంపీటీసీ సభ్యులు మాత్రమే ఉన్నారు. వారిలో పంగూరు ఎంపీటీసీ సభ్యురాలు ఆదిలక్ష్మి ఒక్కరే ఎస్టీ మహిళ.. అయితే ఉన్న 14మంది ఎంపీటీసీ సభ్యు లు కూడా వైఎస్సార్ సీపీ వారే. అయితే ఎంపీపీ అభ్యర్థి అయిన పంగూరు ఎంపీటీసీ సభ్యురాలు పి.ఆదిలక్ష్మితోపాటు కోబాక ఎంపీటీసీ సభ్యురా లు ఎన్.గౌరి, కందాడ ఎంపీటీసీ సభ్యురాలు జి.రేవతి, మడిబాక ఎంపీటీసీ సభ్యురాలు కె.పద్మమ్మ, చెల్లూరు ఎంపీటీసీ సభ్యురాలు ఏ.రాధ, పాపానాయుడు పేట ఎంపీటీసీ సభ్యుడు కె.మునిరాజు, వికృతమాల ఎంపీటీసీ సభ్యుడు పి.రవి, అంజిమేడు ఎంపీటీసీ బి.శ్రీనివాసులు, పాతవీరాపురం ఎంపీటీసీ సభ్యుడు టి.క్రిష్ణవేణి వైఎస్సార్ సీపీ నుంచి ఫిరాయించి, టీడీపీ శిబిరంలో చేరిపోయా రు. వీరందరిని టీడీపీ నేతలు ప్రలోభాలకు, బె దిరింపులకు గురి చేసి బుధవారం మధ్యాహ్నమే ప్రత్యేక శిబిరానికి తీసుకెళ్లి, వారి సెల్‌ఫోన్లను లా క్కున్నారు. వారందరినీ గురువారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక వాహనంలో నేరుగా ఎంపీడీఓ కార్యాలయానికి టీడీపీ నేతలు తీసుకొచ్చారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి శంకర్‌రెడ్డి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకట నారాయణ, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, ఏర్పే డు ఎంపీడీఓ సౌభాగ్యం ఎన్నికల ప్రక్రియను ప్రా రంభించారు. అయితే మిగిలిన ఐదుగురు వైఎస్సార్ సీపీ సభ్యులు ఎంపీపీ ఎన్నిక ప్రక్రియను బాయ్‌కాట్ చేయడంతో టీడీపీ మద్దతిచ్చిన 9 మంది వైఎస్సార్ సీపీ ఫిరాయింపు ఎంపీటీసీ స భ్యులతోనే ఎంపీపీ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. కాసేపటికే పంగూరు ఎంపీటీసీ సభ్యురాలు పి.ఆదిలక్ష్మిని ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్వతంత్ర అభ్యర్థి గెలుపొందినట్లు అధికారులు ధ్రువీకరించారు. అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, బీజేపీ నేత కోలా ఆనంద్‌కుమార్ అక్కడకు చేరుకుని ఎంపీపీని అభినందిస్తూ సంబరాలు చేసుకున్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులను లాక్కుని ఎంపీపీ పీఠాన్ని దక్కించుకున్నామని టీడీపీ సంబరాలు చేసుకోవడంపై ప్రజలు ఇదీ ఒక్క గెలుపేనా? అని పెదవి విరుస్తున్నారు.
ఒక్క ఎంపీటీసీ లేకపోయినా..
ఏర్పేడు మండలంలో మొత్తం 16 ఎంపీటీసీ స్థా నాలున్నాయి. 16 స్థానాలను వైఎస్సార్ సీపీ అభ్యర్థులే గెలుచుకున్నారు. ఇక్కడ ఎంపీపీ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వుడు కావడంతో నాలుగేళ్ల కిందట జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో పల్లం ఎంపీటీసీ సభ్యురాలు గీత ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఆమె వ్యక్తిగత కారణా లతో ఈ ఏడాది ఏప్రిల్‌లో తన పదవికి రాజీనామా చేశారు. దీంతో గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఎంపీపీ ఎన్నిక జరిగింది.
టీడీపీ ప్రలోభాలకు లొంగక..
టీడీపీ ప్రలోభాలు, తీవ్రస్థాయి బెదిరించినా ఆ మందూరు ఎంపీటీసీ సభ్యుడు, తాజా మాజీ ఎంపీపీ జమళ్ల శ్రీనివాసయాదవ్, బండారుపల్లి ఎంపీటీసీ సభ్యులు, వైస్ ఎంపీపీ టి.జనార్ధన్‌రెడ్డి, ఏ ర్పేడు ఎంపీటీసీ సభ్యుడు ఎం.భరత్‌కుమార్, మ ర్రిమంద ఎంపీటీసీ సభ్యుడు కె.నాగరాజరెడ్డి, గు డిమల్లం ఎంపీటీసీ సభ్యురాలు ఎం.సావిత్రి టీడీ పీ చెంతకు చేరలేదు. గురువారం జరిగిన ఎంపీపీ ఎన్నిక అప్రజాస్వామికంగా జరగనున్నట్లు భా వించిన వీరు ఎన్నికకు గైర్హాజరయ్యారు.
ఇదీ ఒక గెలుపేనా..!


