నేడు యువజన విభాగం బలోపేతంపై సమావేశం
తిరుపతి మంగళం : వైఎస్సార్ సీపీ యువజన విభాగాన్ని బలోపేతం చేసేందుకు తిరుపతి లోని డీపీఆర్ కల్యాణ మండపంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఐదు జిల్లాల పార్టీ యువజన విభాగం నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు ఉదయ్‌వంశీ తెలిపారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం బలోపేతంపై ప్రకాశం, నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు, అన్నమయ్య జిల్లాల యువజన విభాగం రాష్ట్ర కమిటీ, జిల్లాల అధ్యక్షులు, నగర, మండల యువజన విభాగం నాయకులు ఈ సమావేశానికి హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భూమన అభినయ్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు.
టెట్‌కు 95 శాతం
మంది హాజరు
తిరుపతి సిటీ: జిల్లా పరిధిలో రెండో రోజు జరిగిన టెట్‌కు 95 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు డీఈఓ కేవీఎస్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గురువారం ఉదయం సెషన్‌లో 7 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 333 మంది హాజరు కావాల్సి ఉండగా 302 మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. అలాగే మధ్యాహ్నం జిల్లాలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో జరిగిన రెండో సెషన్ పరీక్షలకు 470 మంది హాజరు కావాల్సి ఉండగా 420మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసినట్లు తెలపారు.
భూసేకరణ పనులు
వేగవంతం
తిరుపతి అర్బన్: శ్రీసిటీ ఫేజ్ –2కు భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో శ్రీ సిటీ ఫేజ్ – 2కు సంబంధించి వెబ్ ల్యాండ్, ఎల్‌జీ ఫేజ్–1,2 పెండింగ్ భూసేకరణ పనులు, కోర్టు కేసులు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ వెబ్ ల్యాండ్‌పై ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘు వాన్సీ, సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, శ్రీ సిటీ జనరల్ మేనేజర్ భగవాన్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ విజయ్ భరత్ రెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు.


