ఆర్‌ఐఓ కార్యాలయం ముట్టడి
తిరుపతి సిటీ: చంద్రగిరి నారాయణ జూనియర్ కళాశాలలో జరిగిన దుర్ఘటనపై విద్యార్థి సంఘాలు కన్నెర్ర చేశాయి. ఈ మేరకు గురువారం తిరుపతిలోని ఆర్‌ఐఓ కార్యాలయాన్ని ముట్టడించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ చంద్రగిరి నారాయణ జూనియర్ కళాశాలలో యాజమాన్యం ఒత్తిడితో ఓ విద్యార్థి రెండో అంతస్తు నుంచి కిందపడి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దారుణం జరుగుతున్నా ఆర్‌ఐఓ ఆ కళాశాలపై విచారణ చేపట్టక పోవడం దారుణమని మండిపడ్డారు. ఆ విద్యా సంస్థలపై అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్వీయూ ప్రెసిడెంట్ మన్నం ప్రేమ్‌కుమార్, నగర అధ్యక్షుడు స్వరూప్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు శివ బాలాజీ, ఎన్‌ఎల్‌ఎస్‌ఏ అధ్యక్షుడు సుందర్ రాజు, బీడీవీఎస్ ప్రెసిడెంట్ కొండా యుగంధర్, ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం రాయలసీమ అధ్యక్షుడు విజయ్ ఉత్తరాది తదితరులు పాల్గొన్నారు.


