ఈతకు వెళ్లి ఇద్దరి మృతి
రేణిగుంట : మండలంలోని మల్లిమడుగులో ఆదివారం ఈతకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వివరాలు.. తిరుపతిలోని తాతయ్యగుంటకు చెందిన శివ(35), నరేష్(36), శేఖర్ మల్లిమడుగు రిజర్వాయర్ చూసేందుకు వెళ్లారు. సరదాగా ఈత కొట్టేందుకు శివ ముందుగా రిజర్వాయర్‌లోకి దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోతూ కేకలు వేశాడు. ఇది గమనించిన శివ బావ నరేష్ వెంటనే అతడిని కాపాడేందుకు మల్లిమడుగులోకి దూకాడు. ఈ క్రమంలో ఇద్దరూ మునిగిపోయారు. వారితోపాటు వెళ్లిన శేఖర్ అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గ్రామస్తులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు.
పర్యవేక్షణ లోపం
మల్లిమడుగు రిజర్వాయర్ సాధారణంగా వర్షాకాలం నిండుకుండలా ఉంటుంది. ఈ సమయంలో అందులోకి ఎవరూ దిగకుండా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే పర్యవేక్షణ లోపం కారణంగా ఏటా ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతికి సమీపంలోనే ఈ రిజర్వాయర్ ఉండడంతో సెలవు దినాలప్పుడు పెద్దసంఖ్యల నగరవాసులు ఇక్కడకు వస్తుంటారు. ఈ మేరకు భద్రతా చర్యలు చేపట్టడంతో అధికారులు వైఫల్యం చెందారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, పోలీసులు స్పందించి కనీసం సెలవు రోజులప్పుడైనా రిజర్యాయర్ వద్ద నిఘా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఈతకు వెళ్లి ఇద్దరి మృతి


