● అపూర్వ సమ్మేళనం
తిరుపతిలోని ఎస్వీ జూనియర్ కళాశాల 1973–75 బ్యాచ్ విద్యార్థులు 76 మంది ఆదివారం రామానుజ సర్కిల్ వద్ద ఓ ప్రైవేటు హోటల్‌లో కలుసుకున్నారు. ఆత్మీయ సమ్మేళంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి విచ్చేశారు. ప్రస్తుతం 67– 68ఏళ్ల పూర్వవిద్యార్థులు 18 ఏళ్ల కుర్రాళ్లలాగా ఉత్సాహంగా ఉరకలేశారు. ఒకే మామా.. బావా అంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఫొటోలు తీసుకున్నారు. తమకు విద్యాబుద్దులు నేర్పించిన గురువుల బాగోగులను తెలుసుకున్నారు. పరస్పరం యోగక్షేమాలు విచారించుకుని మురిసిపోయారు. – తిరుపతి అర్బన్


