ముప్పు ముంగిట.. కరకట్ట!
జిల్లాలో ప్రమాదకరంగా చెరువులు కూటమి నేతల మట్టి తవ్వకాలతో బలహీనపడిన కట్టలు కనీస మాత్రం పట్టించుకోని అధికారులు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో చేపట్టని మరమ్మతులు అక్కడక్కడా ఇసుక బస్తాలతో తాత్కాలిక ఏర్పాట్లు చేసుకున్న రైతులు కళత్తూరు ఘటన నేపథ్యంలో ఆందోళన చెందుతున్న పలు గ్రామాల ప్రజలు
నిండితే కడ‘గండ్లే’
చిల్లకూరు : మండలంలో సుమారు 62 చెరువులు ఉన్నాయి. వీటికి 7,500 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే చెరువులు పూర్తిగా నిండితే గండ్లు పడే పరిస్థితి. కట్టలకు మరమ్మతులు చేయించమని రైతులు విన్నవిస్తే అధికారులు నిధులు లేవని చేతులు దులిపేసుకుంటున్నారు. ప్రధానంగా ముత్యాలపాడు చెరువు, ఓడూరు, కడివేడు, కలవకొండ, పెన్నాక, యద్దలచెరువు, పాపి చెరువులు ప్రమాదకరంగా ఉన్నాయి. దీంతో స్థానిక రైతులే ఇసుక బస్తాలు వేసుకుని కాపాడుకుంటున్నారు.
జిల్లా సమాచారం
ముప్పు ముంగిట.. కరకట్ట!


