కూటమి నేతల భోజ్యం
చిట్టమూరు : మండలంలో మొత్తం 98 చెరువులు ఉన్నాయి. 30 వేల ఎకరాల ఆయకట్లు ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోగిలి, ఆరూరు, చిట్టమూరు, చిల్లమూరు తదితర చెరువులకు సప్లయ్ చానల్ పనులు చేశారు. అధికారుల పర్యవేక్షణ లేకుండా కూటమి నేతలే కాంట్రాక్టర్లుగా తూతూమంత్రంగా పనులు చేసి నిధులు తినేసినట్లు స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో తూములు శిథిలావస్థకు చేరుకుని చెరువులోని నీరంతా బయటకు వెల్లిపోతుందని వాపోతున్నారు. యాకసిరి, ఆరూరు, మల్లాం, కలగుర్తిపాడు,చిల్లమూరు, మొలకలపూడి చెరువుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని వెల్లడిస్తున్నారు.
07జీడీఆర్101 కలుగుర్తిపాడు చెరువుకు పడిన గండి.
07జీడీఆర్102 శిథిలావస్థకు చేరి నీరు లీకవుతున్న తూము


