తాగి బండెక్కితే కఠిన చర్యలు : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

తాగి బండెక్కితే కఠిన చర్యలు : ఎస్పీ

Nov 8 2025 7:02 AM | Updated on Nov 8 2025 7:02 AM

తాగి బండెక్కితే కఠిన చర్యలు : ఎస్పీ

తాగి బండెక్కితే కఠిన చర్యలు : ఎస్పీ

తిరుపతి క్రైమ్‌ : మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. శుక్రవారం పోలీస్‌ కార్యాలయంలో ఆయన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరికరాలను పంపిణీ చేశారు. ట్రాఫిక్‌ పోలీసులకు మొదటగా ఆయన నూతన బ్రీత్‌ అనలైజర్‌ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి వాహనాలను తనిఖీలను చేయాలని సూచించారు. ప్రతి పోలీసు అధికారి వద్ద తప్పనిసరిగా ఈ పరికరాలు ఉండాలని తెలిపారు. తాగి వాహనాలు నడిపే వారిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలన్నారు. దీనిపై ట్రాఫిక్‌ పోలీసులు నిరంతరం తనిఖీలు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు అరికట్టే ముఖ్య ఉద్దేశంతోనే ఈ పరికరాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement