దేశాభివృద్ధికి పట్టుకొమ్మలు వర్సిటీలే
తిరుపతి సిటీ: దేశాభివృద్ధికి యూనివర్సిటీలే పట్టుకొమ్మలని నీతిఅయోగ్ సభ్యులు, జేఎన్‌యూ చాన్సలర్ డాక్టర్ వీకే సర్వసత్ తెలిపారు. ఎస్వీయూ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం వర్సిటీ సెనేట్ హాల్ వేదికగా ది ఇంజిన్ ఆఫ్ వికసిత్ భారత్– 2047 అనే అంశంపై సర్వసత్ ప్రసంగించారు. ఆధునిక సాంకేతికత, డిజిటల్ వ్యవస్థ నిర్వహణ, పారిశ్రామిక అభివృద్ధి, పరిశోధనలు, పర్యావరణ పరిరక్షణ వంటివి దేశాభివృద్ధికి మూల స్తంభాలని పేర్కొన్నారు. దేశ మేధోసంపత్తి విదేశాలకు తరలిపోవడం బాధ కలిగిస్తోందన్నారు. ఎస్వీయూ వీసీ నర్సింగరావు మాట్లాడుతూ ఎస్వీయూలో నూతన పరిశోధనలకు, నాణ్యమైన విద్యాబోధనపై దృష్టి సారించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీఎస్ కార్యదర్శి డాక్టర్ టి నారాయణరావు, మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమ, రిజిస్ట్రార్ భూపతినాయుడు, రెక్టార్ సీహెచ్ అప్పారావు, ప్రిన్సిపాళ్లు, డీన్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.


