ప్రమాదకరంగా పేరూరు చెరువు
తిరుపతి రూరల్ : మండలంలోని పేరూరు చెరువుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2 కిలోమీటర్ల మేరకు కరకట్ట నిర్మించారు. తర్వాత ఐదేళ్ల పాటు ఉపాధి హామీ పనుల ద్వారా మరమ్మతులు, చెట్లు తొలగింపు వంటి పనులను చేపట్టారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పేరూరు చెరువు కట్టను అప్పటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరింత పటిష్టం చేయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేరూరు చెరువులో అత్యధికంగా మట్టి తవ్వకాలు జరగడంతో భారీగా గోతులు ఏర్పడ్డాయి. దీంతో కట్ట బలహీనంగా మారింది.


