
విహంగాల విహారం
దొరవారిసత్రం: ఆసియా ఖండంలోనే విదేశీ శీతాకాలపు వలస విహంగాలకు అతి పెద్ద సంతానోత్పత్తి కేంద్రంగా బాసిల్లుతున్న నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు విహంగాల ఆగమనం మొదలైంది. దీంతో పక్షుల కిలకిలరావాలు వినిపిస్తున్నాయి. సకాలంలో వర్షాలు కురిసి చెరువులు నీటితో నిండి ఉంటే ఈ పాటికే అన్ని రకాల పక్షుల విచ్చేసి వాటి పనుల్లో నిమగ్నమై ఉండాలి. కాని ఈ దఫా విహంగాల సీజన్(అక్టోబర్‌లో మొదలై ఏప్రిల్‌లో ముగుస్తుంది) మొదలైనప్పటికీ విదేశీ వలస విహంగాలు సందడి ఆలస్యంగా మొదలైంది. ప్రస్తుతం పక్షుల కేంద్రంలో పదుల సంఖ్యలో పక్షుల్లో రారాజుగా పిలిచే గూడబాతుల(పెనికాన్స్)తోపాటు తెల్లకంకణాయిలు(వైట్ ఐబీస్) వందల సంఖ్యలో నత్తగుళ్లకొంగలు విచ్చేసినట్లు స్థానిక వన్యప్రాణి విభాగం సిబ్బంది తెలియజేశారు.
పక్షుల కేంద్రంలో ఈపాటికే...
వర్షాలు సకాలంలో కురిసి ఉంటే పక్షుల కేంద్రం పరిధిలోని అత్తిగుంట చెరువు, నేరేడుగుంట చెరువు, మారేడుగుంట చెరువుల్లో నీరు చేరి ఉంటే వలస విహంగాల్లో ప్రధాన పక్షులు అన్ని ఈ పాటికే చేరి, చెరువుల్లో ఉన్న కడప చెట్లపై చేరి ఆడ, మగ పక్షులు ఒకదాని ఒక్కటి స్నేహం కుదుర్చుకుని పుల్లలతో గూళ్లు కట్టుకుంటూ ఉండాలి. కాని వానలు సక్రమంగా కురవకపోవడంతో వలస విహంగాల సీజన్ ఆలస్యం కాకతప్పలేదు. ఇప్పుడైన పుష్కలంగా వానలు కురవందే వలస విహంగా పూర్తి స్థాయిలో కేంద్రానికి వచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పటి వరకు కురిసిన వానలకు చెరువుల్లోకి అరకొరగానే సాగు నీరు చేరాయి. కేంద్రంలో విదేశీ వలస విహంగాలకు పూర్తి స్థాయిలో వాతవరణం అనుకూలిస్తేనే వేల సంఖ్యలో గూడబాతులు, నత్తగుళ్లకొంగలు, తెల్లకంకణాయిలు, స్వాతికొంగలు, వందల సంఖ్యలో తెడ్డుముక్కుకొంగలు, నీటికాకులు, బాతుజాతికి చెందిన పలు రకాల పక్షుల విచ్చేసి వాటి వాటి సంతానాన్ని అభివృద్ధి చేసుకోలేవు. స్వదేశీ విహంగాలైన నత్తగుళ్లకొంగలు పక్షుల కేంద్రంలోకి గత నెలలోనే వందల సంఖ్యలో విచ్చేశాయి. ఈపక్షుల్లో కొన్ని జత కట్టె పనుల్లో ఉండగా మరి కొన్ని కడప చెట్లపై గూళ్లు కట్టుకునే పనిలో ఉన్నాయి.
పక్షుల కేంద్రంలో గూడబాతులు
తెల్లకంకణాయిలు
నత్తగుళ్లకొంగలు

విహంగాల విహారం

విహంగాల విహారం