
కేసులతో మీడియాను భయపెట్టలేరు
వార్తల్లో ఏవైనా అభ్యంతరం ఉంటే సరైన ఖండన ఇచ్చే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. అలా కాకుండా కేసులు పెట్టి మీడియాను భయపెట్టాలని చూడడం సరైనది కాదు. ఇది పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమే. సాక్షి ఎడిటర్‌పై పోలీసులు వ్యవహరించిన తీరు సరైనది కాదు. పోలీసుల ద్వారా మీడియాను భయపెట్టాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇది మంచిది కాదు. మీడియా పైన కక్ష సాధింపు చర్యలు ఇకనైనా మానుకోవాలి.
– కె. గిరిబాబు, రాష్ట ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్