
ముగిసిన యువ తరంగ్
తిరుపతి సిటీ : ఎస్వీయూలో మూడు రోజులుగా ఎస్వీ యూనివర్సిటీ స్టూడెంట్ వెల్ఫేర్ అండ్ కల్చర్ అఫైర్స్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన యువ తరంగ్ కార్యక్రమం శనివారం ముగిసింది. శ్రీనివాసా ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ విజయ భాస్కరరావు మాట్లాడుతూ.. మనిషి జీవన వికాసానికి కళలు మూలాధారంగా నిలుస్తాయని పేర్కొన్నారు. అనంతరం ఎస్వీయూ రిజిస్ట్రార్ భూపతి నాయుడు మాట్లాడుతూ.. ఎన్నో గొప్ప చారిత్రక సాంస్కతిక కార్యక్రమాలను యూనివర్సిటీ చేపట్టిందని గుర్తు చేశారు. శనివారం శ్రీనివాస ఆడిటోరియం, అన్నమయ్య భవనం, సేనెట్ హాల్ వంటి కేంద్రాల్లో నిర్వహించిన సాంస్కృతిక పోటీలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ బీవీ మురళీధర్, కల్చర్ అఫైర్స్ కో–ఆర్డినేటర్ డాక్టర్ పత్తిపాటి వివేక్, న్యాయ నిర్ణేతలు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ముగిసిన యువ తరంగ్