తిరుపతి అర్బన్:తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్యకు జాయింట్ కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించా రు. శుక్రవారం రాత్రి ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్‌కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆమె ఇప్పటికే తుడా వీసీగా, తిరుపతి స్మార్ట్ సిటీ ఎండీగా విధులు నిర్వర్తిస్తుండడం గమనార్హం.
టీటీడీలో కొరవడిన పారదర్శకత
తిరుపతి కల్చరల్: టీటీడీలో జవాబుదారీతనం, పారదర్శకత కొరవడిందని శివరామేశ్వరి శక్తి పీఠాధిపతి శివానందస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ భక్తులు కలవాలంటే ముందు అపాయింట్‌మెంట్ తీసుకొని చెప్పినప్పుడు కలవాలని నిర్ణయం చేయడం దుర్మార్గమన్నారు. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామి తిరుమల స్వామి వారి వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లు పొంది వాటిని డబ్బులకు విక్రయిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని టీటీడీ ఈవో దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈవోను కలిసేందుకు తాము శుక్రవారం వెళ్లడం జరిగిందన్నారు. అయితే ఈవోను కలవాలంటే అపాయింట్ మెంట్ తీసుకోవాలని చెప్పడం శోచనీయమన్నారు. కూటమి ప్రభుత్వానికి ఈవో వ్యవహార తీరుతో చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలో అనిల్‌కుమార్, జయరామిరెడ్డి, డిల్లీ, దీపక్, యజ్ఞేష్ పాల్గొన్నారు.
జేసీగా మౌర్యకు బాధ్యతలు