
కూటమి అరాచకాలపై సమరం
రెడ్‌బుక్ ఆగడాలను డిజిటల్ బుక్‌లో పెడదాం
ప్రజల తరఫున పోరుకు సిద్ధంగా కమిటీలు
వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం
శ్రీకాళహస్తి : కూటమి అరాచకాలపై ఉద్యమించాలని, రెడ్‌బుక్ ఆగడాలను డిజిటల్ బుక్‌లో నమోదు చేద్దామని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి ఆడిటోరియంలో శనివారం మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అన్ని మండలాలు, పట్టణం నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ముందుగా గ్రామ, వార్డు, మండల కమిటీల నియామకాలపై వైఎస్సార్‌సీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్ర భాస్కర్‌రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. అక్రమ కేసుల అరెస్టుపై పోరాటం చేసేందుకు జగనన్న సైన్యం సిద్ధంగా ఉండాలని కోరారు. కక్ష సాధింపు చర్యలకు భయపడేది లేదని నిరంకుశ పాలనకు మంగళం పాడే వరకు విశ్రమించబోమని పేర్కొన్నారు. జగనన్న చేసే యజ్ఞంలో మనం క్రియాశీల పాత్రదారులం కావాలని కోరారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని బూతు స్థాయిలో నిత్యం పరిశీలిస్తూ ఉండాలన్నారు. టీడీపీ ఎల్లో మీడియా, సోషల్ మీడియా చేస్తున్న గ్లోబెల్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు. రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యమని జగనన్న మాటగా గ్రామస్థాయిలో తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీపై ఉందని అన్నారు. కార్యక్రమంలో ముక్కంటి ఆలయ మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఓడూరు గిరిధర్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ భాష తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎంపీ గురుమూర్తి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం

కూటమి అరాచకాలపై సమరం

కూటమి అరాచకాలపై సమరం