
ముక్కంటి సేవలో కల్వకుంట్ల కవిత
శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారిని ఆదివారం తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత కుటుంబ సమేతంగా సేవించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆలయ పాలకమండలి మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా ఆమె ప్రత్యేకంగా రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేదపండితులు వారిని ఆశీర్వదించి ఆదిదంపతుల జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రంమలో వైఎస్సార్‌సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవనాయుడు, నేతలు పగడాల రాజు, వయ్యాల కృష్ణారెడ్డి, కంఠా ఉదయ్‌కుమార్, గున్నేరి కిషోర్‌రెడ్డి, మున్నా రాయల్, మునికృష్ణారెడ్డి, కూనాటి రమణయ్యయాదవ్, పఠాన్ ఫరీద్, పసల కృష్ణయ్య, ముని, శివకుమార్‌యాదవ్, పులి రామచంద్ర, శ్రీను, సాగీరాబీ, షర్మిల ఠాగూర్, పెరుమాళ్ చౌదరి, ఫజల్ పాల్గొన్నారు.