
సెల్‌ఫోన్ దొంగలు అరెస్ట్
తిరుపతి క్రైం: సెల్‌ఫోన్ దొంగలను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు కథనం.. సెల్‌ఫోన్ దొంగల సమాచారం మేరకు ఈస్ట్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ రామాంజినేయులు, సిబ్బంది తిరుపతిలోని విష్ణునివాసం, రైల్వే స్టేషన్, బస్టాండ్ తదితర పరిసరాల్లో నిఘా పెంచారు. అక్కడ తచ్చాడుతున్న అనంతపురం జిల్లాకు చెందిన పవన్‌కుమార్‌నాయక్, హైదరాబాద్‌కు చెందిన మందాల దినేష్, ప్రకాశం జిల్లాకు చెందిన మోగానందరెడ్డి, మదనపల్లికి చెందిన అశోక్, కడపకు చెందిన శ్రీకాంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో భక్తులు, యాత్రీకులు, ప్రయాణికుల వద్ద సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్నట్టు ఒప్పుకున్నారు. ఈ మధ్య కాలంలో విష్ణునివాసం వద్ద బెంగళూరుకు చెందిన యాత్రికుల రెండు సెల్ ఫోన్లు, 30 గ్రాముల బంగారాన్ని చోరీ చేసినట్టు అంగీకరించారు. అలాగే టీటీడీ శ్రీనివాసం వద్ద యాత్రికుల రూమ్‌లో మూడు సెల్‌ఫోన్లు, రూ.10 వేల నగదు దొంగతనం చేసి పట్టుబడ్డారు. ఈ మేరకు వారి నుంచి 18 సెల్‌ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. ఆపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచారు.