
జాతీయ సెమినార్ బ్రోచర్ విడుదల
తిరుపతి సిటీ: స్థానిక అంబేడ్కర్ గ్లోబల్ న్యాయ కళాశాల వేదికగా డిసెంబర్ 13, 14న నిర్వహించనున్న జాతీయ సదస్సుకు సంబంధించి బ్రోచర్లను కళాశాల చైర్మన్ డాక్టర్ తిప్పారెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, దేశం నలుమూలల నుంచి ఎంతో మంది లా విద్యార్థులు, పరిశోధకులు ఈ సదస్సుకు హాజరుకానున్నారని, నాలెడ్జ్ షేరింగ్, నూతన అంశాలపై విద్యార్థులకు సదస్సులు మరింత జ్ఞానాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ బిజయ కుమార్ బెహెరా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఉపాధ్యాక్షులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

జాతీయ సెమినార్ బ్రోచర్ విడుదల