
బ్యాంక్ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోండి
తిరుపతి అర్బన్: బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవాలని తిరుపతి బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఽఘం అధ్యక్షులు విజయభాస్కర్, కార్యదర్శి ధన్వంత్‌కుమార్ డిమాండ్ చేశారు. తిరుపతిలోని కరూర్ వైశ్యాబ్యాంక్ వద్ద ఉద్యోగులు మంగళవారం ధర్నా చేశారు. ఉద్యోగ సంఘం నేతలు మాట్లాడుతూ ప్రైవేటు బ్యాంకుల జాతీయకరణ చేపట్టాలని పేర్కొన్నారు. క్లరికల్, సబ్‌స్టాఫ్ ఉద్యోగాల నియామకం, సీఎస్‌బీ బ్యాంకుల్లో సత్వర వేతన సవరణ, ప్రైవేటు బ్యాంక్ ఉద్యోగుల పెన్షనర్లకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగ సంఘం కమిటీ సభ్యులు జనార్దన్, యగ్నేష్‌బాబు, కేశవరెడ్డి, భాస్కర్, రేష్మ, సుమంత్, నిర్మలదేవి, పవన్‌కుమార్, వెంకటలక్ష్మి, లక్ష్మీపతి, మహేష్, శంకరరావు, నటరాజ్ పాల్గొన్నారు.