వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ తిరుచానూరు వరకే | - | Sakshi
Sakshi News home page

వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ తిరుచానూరు వరకే

Oct 8 2025 6:07 AM | Updated on Oct 8 2025 6:07 AM

వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ తిరుచానూరు వరకే

వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ తిరుచానూరు వరకే

● రేపటి నుంచి టెర్మినల్‌ మార్పు చేస్తూ తాజా నిర్ణయం ● ప్రయాణికులు గమనించాలని రైల్వేశాఖ ప్రకటన

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌: తిరుపతికి రాకపోకలు సాగిస్తున్న 10 వీక్లీ ఎక్స్‌ ప్రెస్‌ రైళ్ల టెర్మినల్‌ను గురువారం నుంచి తిరుచానూరు రైల్వేస్టేషన్‌కు మారుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ ప్రకటించింది. ఈ మేరకు ప్రయాణికులను అప్రమత్తం చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రైళ్ల టైమింగ్స్‌లోనూ మార్పులు చేసింది. ఈ నెల 13 నుంచి జల్నా – తిరుచానూరు రైలు (నెంబర్‌ 07609) ఉదయం రేణిగుంటలో 9.28 గంటకు, తిరుచానూరుకు 10.45 గంటలకు చేరుకుంటుంది. ఈ నెల 13 నుంచి తిరుచానూరు – జల్నా రైలు (నెంబర్‌ 07610) తిరుచానూరులో మధ్యాహ్నం 3.20 గంటలకి బయలుదేరుతుంది. రేణిగుంటలో 3.35కు చేరుకుంటుంది.

ఈ నెల 15నుంచి చర్లపల్లి – తిరుచానూరు రైలు (నెంబర్‌ 07251) రేణిగుంటకు ఉదయం 5.58 గంటలకి, తిరుచానూరుకు 8 గంటలకు చేరుకుంటుంది. ఈ నెల 15 నుంచి తిరుచానూరు – చర్లపల్లికి వెళ్లే రైలు (నెంబర్‌ 07252) తిరుచానూరులో సాయంత్రం 4.55 గంటలకు బయలుదేరుతుంది. రేణిగుంటలో 5.14 గంటలకు చేరుకుంటుంది. ఈ నెల 11 నుంచి నాందేడ్‌ – తిరుచానూరు రైలు (నెంబర్‌ 07015) రేణిగుంటకు ఉదయం 10.28 గంటలకు, తిరుచానూరుకు 11.30 గంటలకు చేరుకుంటుంది. తిరుచానూరు – నాందేడ్‌ రైలు (నెంబర్‌ 07016) రాత్రి 7.50కి తిరుచానూరులో బయల్దేరి రాత్రి 8.05 గంటలకు రేణిగుంట చేరుకుంటుంది.

ఈ నెల 9 నుంచి సికింద్రాబాద్‌ – తిరుచానూరు రైలు (నెంబర్‌ 07009) ఉదయం 8.58 గంటలకి రేణిగుంటకు వచ్చి 10.30కి తిరుచానూరుకు చేరుకుంటుంది. తిరుచానూరు – సికింద్రాబాద్‌ రైలు (నెంబర్‌ 07010) సాయంత్రం 4.40గంటలకి తిరుచానూరులో బయల్దేరి 4.55 గంటలకు రేణిగుంట చేరుకుంటుంది. ఈ నెల 12 నుంచి చర్లపల్లి–తిరుచానూరు రైలు (నెంబర్‌ 07017) ఉదయం 8.58 గంటలకు రేణిగుంటకు చేరుకుని, 11.15గంటలకు తిరుచానూరు వెళ్తుంది. తిరుచానూరు – చర్లపల్లి రైలు (నంబర్‌ 07018) సాయంత్రం 4.40 గంటలకి తిరుచానూరులో బయలుదేరి 4.55గంటలకు రేణిగుంటకు చేరుకుంటుంది. ఇతర స్టేషన్లలో మాత్రం ఈ రైళ్ల సమయాల్లో ఎలాంటి మార్పులూ లేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement