
కుంటుపడిన సేవలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య సేవలు కుంటుపడ్డాయి. పల్లె వైద్యం పూర్తిగా పడకేసింది. పీహెచ్‌సీల్లో వైద్యం ఆమడదూరంలో నిలిచిపోయింది. మందులు, మాత్రలు కరువయ్యాయి. వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రస్తుతం పీహెచ్‌సీ వైద్యులు సమ్మె బాట పట్టారు. దీంతో పీహెచ్‌సీల్లో వైద్యం చేసేవారు లేక వెలవెలబోతున్నాయి. ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజల సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఈ క్రమంఓనే ఆర్‌ఎంపీలు, ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించేవారు పెరిగిపోయారు. ఇదే అదునుగా పీహెచ్‌సీ సిబ్బంది సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తూతూమంత్రంగా వచ్చి వెళ్లిపోతున్నారు. సమ్మె ప్రభావంతో 104 సేవలు సైతం స్తంభించాయి.