
పెయిన్ కిల్లర్స్‌తో కిడ్నీలకు ముప్పు
దొరవారిసత్రం: మండలంలోని పాళెంపాడులో బుధవారం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి వైద్యులు పర్యటించారు. నెఫ్రాలజిస్ట్ రవికుమార్, పాథాలజిస్ట్ మల్లికార్జున్, జనరల్ మెడిసిన్ రమేష్ క్షేత్రస్థాయిలో బాధితులతో మాట్లాడారు. వారి మెడికల్ రిపోర్టులు పరిశీలించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో పలువురు కొన్నేళ్ల నుంచి అధిక మోతాదులో పెయిన్ కిల్లర్స్ వాడినట్లు గుర్తించారు. అందుకే క్రియాటిన్ లెవెల్స్ పెరిగి కిడ్నీలు దెబ్బతిన్నట్లు బృందం సభ్యులు వెల్లడించారు. మరి కొందరికి 60 ఏళ్లు దాటడంతో వయసు రీత్యా కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చినట్లు వివరించారు. పాళెంపాడు గ్రామంలో ఇప్పటి వరకు 25 మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. వీరిలో వైద్య బృందం 16మందిని కలిసి మాట్లాడింది. ఆరుగురికి మరో సారి కిడ్నీ సంబంధిత వైద్య పరీక్షలను స్విమ్స్‌లో చేయించాలని నిర్ణయించింది. గ్రామంలో ఓవర్‌హెడ్ ట్యాంకు నీళ్లు, చేతి బోర్లు నీటిని తాగడం వల్ల ఎముల సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశముందని, కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే ఛాన్స్‌లేదని నీటి పరీక్షల్లో తేలినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరంలోని సిబ్బందితో మాట్లాడి రోగుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వైద్యం అందించే విధివిధానాలపై సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీఓ వీరకుమార్, పంచాయతీ కార్యదర్శులు నాగరాజు, అరుణరుత్విక్, సూర్యకిరణ్ పాల్గొన్నారు.

పెయిన్ కిల్లర్స్‌తో కిడ్నీలకు ముప్పు