
వంచనకు కేరాఫ్ చంద్రబాబు
వెంకటగిరి రూరల్ : వంచనకు కేరాఫ్ చంద్రబాబు అని, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం, ప్రజలను మోసం చేయడం ఆయన నైజమని వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం పట్టణంలోని నేదురుమల్లి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు సీ్త్రనిధి కింద ప్రతి నెలా రూ.1,500 ఇస్తామని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జమ చేయలేదని విమర్శించారు. అలాగే నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని యువతను మోసం చేశారని ఆరోపించారు. విద్యావ్యవస్థనుమంత్రి లోకేష్ పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు వెనకడుగు వేస్తున్నారని స్పష్టం చేశారు.
జగన్ 2.0 ఓ వరం
వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలకు భరోసా కల్పించే దిశగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన జగన్ 2.0 ఒక వరమని నేదురుమల్లి తెలిపారు. అందులో భాగంగానే రాష్ట్ర స్ధాయి నుంచి గ్రామస్ధాయి వరకు పార్టీలో కార్యకర్తలకు పదవులు కేటాయించారని వెల్లడించారు. వెంకటగిరి నియోజకవర్గానికి ఎస్‌ఈసీ (స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) సభ్యులుగా ముగ్గురికి అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఎస్‌ఈసీ మెంబర్ బొలిగర్ల మస్తాన్‌యాదవ్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని స్పష్టం చేశౠరు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ పులి ప్రసాద్‌రెడ్డి, పద్మశాలి కార్పొరేషన్ మాజీ చైర్మన్ నక్కా వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా సంయుక్త సహాయ కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, మున్సిపల్ విప్ పూజారి లక్ష్మి, వైస్ చైర్మన్ సేతరాసి బాలయ్య, కౌన్సిలర్లు ధనియాల రాధ, కందాటి కల్యాణి, ఎంఏ నారాయణ, ఆరి శంకరయ్య, నేతలు ఎం.వెంకటేశ్వర్లు, మస్తాన్‌రెడ్డి, కందాటి రాజారెడ్డి, పూజారి శ్రీనివాసులు, కల్లు సతీష్, మల్లిరెడ్డి, రొంటాల చిన్నా, కూనా మల్లికార్జున్, సీహెచ్ మురళి పాల్గొన్నారు.