
పిడుగుపాటుకు ఆవుల మృతి
చిట్టమూరు: మండలంలో గురువారం పిడుగుపడి మూడు ఆవులు మృతి చెందాయి. మండల పరిధిలోని మల్లాం గ్రామానికి చెందిన చెన్నారెడ్డి బాబురెడ్డికి చెందిన ఆవులు గ్రామానికి సమీపంలోని పొలాల్లో మేతకు వెళ్లాయి. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. ఉరుములు, మెరుపులతో పొలాల్లో పిడుగు లు పడ్డాయి. దీంతో పొలాల్లో మేత మేస్తున్న బాబురెడ్డికి చెందిన మూడు ఆవులు అక్కడిక్కడే మృతి చెందా యి. అదృష్టవశాత్తు ఆవులు మేపుతున్న కాపరికి ఎటువంటి ప్రమాదం జరుగలేదని స్థానికులు తెలిపారు.