
బైక్‌ను ఢీకొన్న ఆటో: వ్యక్తి మృతి
తిరుపతి రూరల్ : పూతలపట్టు –నాయుడుపేట ప్రధాన రహదారిలోని తిరుపతి రూరల్ మండలం రామానుజపల్లి క్రాస్ వద్ద బైక్‌ను ఆటో ఢీకొన్న సంఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల సమాచారం మేరకు.. తిరుపతి నగరంలోని ఉప్పంగి హరిజన వాడకు చెందిన దివాకర్ చంద్రగిరిలో తన పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై తిరుపతికి వైపు వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న దివాకర్ (19) కింద పడటంతో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికుల సమాచారంతో 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. బాధితుడి సోదరుడు సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ షేక్ షావల్లీ కేసు నమోదు చేశారు.